బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా
- జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న సింధియా
- సింధియాకు సాదరంగా పార్టీలోకి ఆహ్వానం
- ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం
కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువాను ఆయన కప్పుకున్నారు. బీజేపీలోకి సింధియాను సాదరంగా ఆహ్వానించిన నడ్డా, ఆయన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాయలయంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. బీజేపీలో చేరిన సింధియాను ఈ సందర్భంగా అభినందించారు.