వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి
- టీడీపీ నుంచి వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు
- జగన్ సమక్షంలో పార్టీలో చేరిన రామసుబ్బారెడ్డి
- రామసుబ్బారెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జగన్
టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ ను కలిసిన రామసుబ్బారెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. రామసుబ్బారెడ్డిని సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన రామసుబ్బారెడ్డికి టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో ఆయన మంత్రి పదవి కూడా చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆయనను రామసుబ్బారెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటినుంచి రామసుబ్బారెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం మొదలైంది.