వైసీపీ గూటికి కరణం బలరాం.. చీరాల నియోజకవర్గానికి కొత్త ఇన్‌ఛార్జిని నియమించిన టీడీపీ
- టీడీపీకి గుడ్ బై చెప్పిన కరణం బలరాం
- అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు
- చీరాల నియోజకవర్గ ఇన్చార్జిగా యడం బాలాజీ నియామకం
తెలుగుదేశం పార్టీకి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు చీరాల నుంచి భారీ అనుచరగణంతో ఆయన అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి బయల్దేరారు.
ఇక వైసీపీలో చేరనున్నట్టు కరణం బలరాం ప్రకటించిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా పరిణామాలపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గ ఇన్చార్జిగా యడం బాలాజీని నియమించారు. ఈ మేరకు పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు ప్రకటనను విడుదల చేశారు.
టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడుగారి ఆదేశానుసారం ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ ఇన్చార్జిగా యడం బాలాజీని నియమించడం జరిగిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.