ఢిల్లీ అల్లర్ల కారకులను గుర్తించడంలో ఆధార్ డేటా వాడడంలేదు: అమిత్ షా

  • ఇప్పటివరకు ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నామన్న అమిత్ షా
  • డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీల ద్వారా నిందితుల్ని గుర్తిస్తామని వెల్లడి
  • ఆధార్ డేటా వాడుతున్నామన్న ప్రచారంలో నిజంలేదన్న షా
ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర దాగి వుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అయితే ఈ అల్లర్లకు కారకులను గుర్తించేందుకు కేంద్రం ఆధార్ డేటా వినియోగిస్తోందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్ల కారకులను గుర్తించడంలో తాము ఆధార్ డేటా జోలికి వెళ్లడంలేదని, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఢిల్లీ అల్లర్లకు విదేశీ సంస్థలతో పాటు దేశంలోని మరికొన్ని సంస్థలు నిధులు సమకూర్చినట్టు ఆధారాలు ఉన్నాయని అమిత్ షా అన్నారు. రాజ్యసభలో ఆయన ఈ విషయాలు తెలిపారు.


More Telugu News