నాలాంటి వాళ్లకు రైతుబంధు డబ్బులు అవసరమా?: ప్రభుత్వంపై కోమటిరెడ్డి ఫైర్
- రైతు బంధు డబ్బులు పేద రైతులకే దక్కాలి
- నా ఖాతాలో రూ. 3 లక్షల రైతుబంధు డబ్బులు పడ్డాయి
- భూస్వాములు, పెద్ద రైతులకు కూడా ప్రభుత్వం డబ్బు ఇస్తోంది
రైతులకు ఎంత సాయం చేసినా మంచిదేనని... ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు మంచి కార్యక్రమమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే రైతు బంధు ప్రయోజనాలు ధనవంతులకు కాకుండా పేద రైతులకు మాత్రమే దక్కాలని సూచించారు.
ఇదే సమయంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న తీరుపై మండిపడ్డారు. తన బ్యాంకు ఖాతాలో కూడా రూ. 3 లక్షల రైతుబంధు డబ్బులు పడ్డాయని... తనలాంటి వాళ్లకు రైతుబంధు డబ్బు అవసరమా? అని ప్రశ్నించారు. భూస్వాములు, పెద్ద రైతులకు కూడా ప్రభుత్వం డబ్బు ఇస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్టీసీ సమ్మెతో ఎవరు లాభపడ్డారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కార్మికులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. సమ్మె సమయంలో చనిపోయిన కార్మికులను మళ్లీ తీసుకురాగలమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మద్యానికి బానిసై యువత నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.