అమెరికా, చైనా మధ్య కరోనా యుద్ధం

  • చైనాకు కరోనా తీసుకువచ్చింది అమెరికానే అంటూ చైనా ఆరోపణ
  • చైనా రాయబారికి సమన్లు పంపిన అమెరికా
  • వెంటనే ఆ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్
కరోనా వైరస్ మహమ్మారి అగ్రరాజ్యాలు అమెరికా, చైనా మధ్య స్పర్ధకు కారణమైంది. చైనాలో కరోనా తీసుకువచ్చింది అమెరికానే అంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరోపించడంపై అమెరికా తీవ్రస్థాయిలో స్పందించింది. తమ తూర్పు ఆసియా దౌత్యవేత్త డేవిడ్ స్టిల్ వెల్ ద్వారా చైనా రాయబారికి సమన్లు జారీ చేయించింది. వెంటనే ఆ వ్యాఖ్యలను ఖండించాలంటూ ఆ సమన్లలో స్పష్టం చేసింది.

 ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలు చేయడం ఎంతో ప్రమాదకరం అని అమెరికా అభిప్రాయపడింది. కరోనా ఉనికిని ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టిందన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు చైనా పక్కదారి పట్టిస్తోందని డేవిడ్ స్టిల్ వెల్ వ్యాఖ్యానించారు. కరోనా విషయంలో అమెరికాను నిందించడం తగదని అటు ఆ దేశ భద్రతా దళాల అధికార ప్రతినిధి అలిస్సా ఫరా పేర్కొన్నారు.


More Telugu News