బాల్ కోసం వెతుకులాట... క్రికెట్ మైదానంలో ప్రేక్షకులు లేకుంటే అంతే... నవ్వు తెప్పిస్తున్న వీడియో!

  • కరోనా భయంతో ఖాళీగా స్టేడియాలు
  • ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ ల నిర్వహణ
  • సిక్స్ కొట్టడంతో బాల్ కోసం ఆటగాళ్ల వెతుకులాట
క్రికెట్ మ్యాచ్ అంటేనే... మైదానంలో వేలాది మంది ప్రేక్షకులు ఉంటారు. అయితే, కరోనా పుణ్యమాని ఇప్పుడు ముందుగా షెడ్యూల్ చేసుకున్న చాలా మ్యాచ్ లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతూ ఉండగా, మరెన్నో మ్యాచ్ లు రద్దయ్యాయి. తాజాగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఈ మ్యాచ్ లో ఓ ప్లేయర్ సిక్స్ కొట్టగా, ఖాళీగా ఉన్న కుర్చీల మధ్య బాల్ పడిపోయింది.

ఇంకే ముంది... బాల్ ను వెతికి తెచ్చేందుకు ఆసీస్ ప్లేయర్లు, స్వయంగా కుర్చీల మధ్యకు వెళ్లాల్సి వచ్చింది. స్టార్క్, జోష్ తదితరులు బాల్ ను వెతుకుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. "ఆ బాల్ దొర్లుకుంటూ కిందకు వచ్చుంటుంది... కింద వెతకాల్సింది" అని, "గల్లీ క్రికెట్ లో మాదిరి మైదానం దాటితే అవుట్ అన్న కొత్త రూల్ తేవాలి" అని, "ప్రేక్షకులు లేకుంటే ఇలాగే ఉంటుంది మరి..." అంటూ కామెంట్లు పెడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.


More Telugu News