అలాగైతే ఎన్నికల వాయిదాపై చంద్రబాబు స్టేట్‌మెంట్లు మరోలా ఉండేవి: విజయసాయిరెడ్డి
- నిమ్మగడ్డ ఫొటోకు టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు
- తమ కృతజ్ఞతలు చాటుకున్నారు
- నిజంగా కరోనా భయానికే వాయిదా వేస్తే చంద్రబాబు మరోలా స్పందించేవారు
- వాయిదాతో పరాజయ భారాన్ని కొన్ని రోజులు తప్పించుకున్నాడు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడడంపై టీడీపీ నేతల తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ కారణంతోనే ఎన్నికలు వాయిదా వేసి ఉంటే చంద్రబాబు స్టేట్‌మెంట్లు మరోలా ఉండేవంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
'ఎన్నికలు వాయిదా వేసి పరువు నిలబెట్టినందుకు నిమ్మగడ్డ ఫొటోకు టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. నిజంగా కరోనా భయానికే ఎన్నికలు వాయిదా వేసి ఉంటే చంద్రబాబు స్టేట్‌మెంట్లు మరోలా ఉండేవి. వాయిదాతో పరాజయ భారాన్ని కొన్ని రోజులు తప్పించుకున్నాడు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.