దుకాణాలు మూసేయమన్నందుకు పోలీసులపై రాళ్లు రువ్వుతూ దాడులు

  • కరోనాను అరికట్టడానికి కృషి చేస్తూ కఠినంగా వ్యవహరిస్తోన్న పోలీసులు
  • పలు ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తోన్న రాళ్ల దాడి ఘటనలు
  • అసోంలో మార్కెట్‌ను తెరిచిన వైనం
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేస్తూ కఠినంగా వ్యవహరిస్తోన్న పోలీసులపై కొందరు రాళ్లు రువ్వుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చట్టాన్ని అమలు చేసేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ జనాలు గూమికూడకుండా, దుకాణాలు తెరవనీయకుండా చేస్తోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అసోంలోని భావ్లాగురి బోది బజార్‌లో లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ కొందరు వ్యాపారులు తమ సొంత లాభాల కోసం దుకాణాలు తెరిచారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి మూసేయాలని అన్నారు. దీంతో వ్యాపారులంతా కలిసి పోలీసులపై రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశామని ఎస్పీ ఆర్‌ఎస్‌ మిల్లీ తెలిపారు. అసోంలోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులపై దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.


More Telugu News