ప్రేమ అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది: అల్లు అర్జున్

  • అల్లు అర్జున్ కుమారుడు అయాన్ పుట్టినరోజు నేడు
  • నీవు వచ్చిన తర్వాతే ప్రేమంటే ఏంటో అర్థమయింది
  • ఐ లవ్యూ అయాన్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బన్నీ... భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు. 'ప్రేమ అంటే ఏమిటనే దానిపై నా జీవితమంతా ఆలోచించా. ప్రేమ అంటే ఇదేనేమో అని గతంలో చాలా సార్లు అనుకున్నా. అయితే అదే ప్రేమ అని కచ్చితంగా చెప్పలేను. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో నాకు అర్థమైంది. ప్రేమ అంటే నువ్వే. ఐ లవ్యూ అయాన్. హ్యాపీ బర్త్ డే మై బేబీ' అని ట్వీట్ చేశాడు.


More Telugu News