లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామాలను దత్తత తీసుకున్న మోహన్ బాబు, మంచు విష్ణు
- చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో 8 గ్రామాల దత్తత
- రోజూ రెండు పూటల భోజనం
- ఉచితంగా మాస్కులు, శానిటైజర్ల పంపిణీ
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం దేశంలో 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో అన్నీ నిలిచిపోయాయి. పేదల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. మోహన్ బాబు తన కుమారుడు విష్ణుతో కలిసి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో పేదలకు రెండు పూటల ఆహారం అందించడమే కాదు, 8 టన్నుల కూరగాయలను కూడా అందించారు. ఈ గ్రామాల్లోని ప్రజలకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ ముగిసేవరకు గ్రామాల్లో సేవలు అందిస్తామని తెలిపారు.