దూరదర్శన్ కు పూర్వవైభవం... ఇండియాలో నంబర్ వన్ చానెల్!

  • 30 ఏళ్ల క్రితం టీవీ అంటే దూదర్శనే
  • ఆపై శాటిలైట్ చానెల్స్ రాకతో డీడీ వీక్షకుల మందగింపు
  • పాత సీరియల్స్ తో ఇప్పుడు పునర్వైభవం

ఇప్పుడంటే, వందల కొద్దీ టీవీ చానెళ్లు ఉన్నాయిగానీ, ఓ మూడు దశాబ్దాల క్రితం టీవీ చానెల్ అంటే దూరదర్శనే. శుక్రవారం చిత్రలహరి, శని, ఆదివారాల్లో సినిమాలు వస్తున్నాయంటే, టీవీలు ఉన్న వారి ఇళ్లు కిక్కిరిసిపోయేవి. దూరదర్శన్ లో రామాయణం, మహాభారతం ప్రసారమైన 1980వ దశకంలోనే టీవీలు వేల ఇళ్ల నుంచి లక్షల ఇళ్లకు మారిపోయాయి. ఆపై శాటిలైట్ చానెళ్ల రాకతో, దూరదర్శన్ కు వీక్షకుల సంఖ్య క్రమంగా పడిపోయింది. 


ఇక ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో దూరదర్శన్ లో పాత సీరియల్స్ ను పునఃప్రసారం చేస్తుండటంతో, దూరదర్శన్ పూర్వవైభవాన్ని అందుకుంది. లాక్ డౌన్ కు ముందు టాప్-10లోనూ కనిపించని డీడీ నేషనల్, తాజా బార్క్ (బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) గణాంకాల ప్రకారం, ఇప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉంది. మార్చి 27తో ముగిసిన వారాంతంతో పోలీస్తే, ఏప్రిల్ 3 నాటికి డీడీ వీక్షకుల సంఖ్య ఏకంగా 580 రెట్లు పెరిగింది. దూరదర్శన్ లో రామాయణం, మహాభారతం, శక్తిమాన్, సర్కస్, బ్యోమషేక్ బక్షి తదితర సీరియల్స్ ను తిరిగి ప్రసారం చేస్తుండడంతో, ప్రతి ఒక్కరూ వాటిని చూస్తున్నారని బార్క్ పేర్కొంది. 



More Telugu News