ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబై 'ధారావి'లో కలకలం.. 43 మందికి కరోనా పాజిటివ్‌!

  • నలుగురి మృతి
  • ధారావిలో పరీక్షలు నిర్వహిస్తోన్న వైద్య సిబ్బంది
  • చుట్టూ బారికేడ్‌లు ఏర్పాటు చేసి చర్యలు
మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై ధారావిలో కలకలం రేగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయిలోని 'ధారావి'లో  దాదాపు 15 లక్షల మంది నివాసం ఉంటారు. ఈ ప్రాంతంలో ఇటీవల కరోనాతో ఓ వ్యక్తి మరణించడంతో అధికారులు అప్రమత్తమైన విషయం తెలిసిందే.

ధారావిలో ప్రజలకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరిన్ని పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ధారావిలో కొవిడ్-19 కేసులు 43కు చేరుకున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు చెప్పారు.

ఇప్పటికే ధారవి చుట్టూ బారికేడ్‌లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఐసోలేషన్, క్వారంటైన్‌ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో కరోనా వ్యాప్తి మొదలైతే దాన్ని నిరోధించడం కష్టమైన పనని అధికారులు ఆందోళన చెందుతున్న వేళ అక్కడ మరో కరోనా కేసు నిర్ధారణ కావడం అలజడి రేపుతోంది.


More Telugu News