విద్యార్థుల కోసం గూగుల్ 'యూట్యూబ్ లెర్నింగ్' సదుపాయం.. పిల్లల కోసం ప్రత్యేక యాప్
- లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన వారికి ఉపయుక్తం
- సైన్స్, మ్యాథ్స్, లాంగ్వేజెస్‌తోపాటు నైపుణ్యాభివృద్ధి పాఠాలు
- హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బోధన...త్వరలో ప్రాంతీయ భాషల్లోనూ
లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలు మూతపడి ఇళ్లకే పరిమితమైన విద్యార్థుల కోసం గూగుల్ సరికొత్త ఈ-లెర్నింగ్ విభాగాన్ని అందుబాటులోకి తెస్తోంది. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బందికి అనుకూలమైన ఫీచర్స్‌తో ఇది అందుబాటులోకి రానుంది.
ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో అందుబాటులో ఉండే ఈ విభాగంలో సైన్స్, మ్యాథ్స్, భాషలతోపాటు నైపుణ్యాభివృద్ధి అంశాలు, యోగా, ఫొటోగ్రఫీపై పాఠాలుంటాయని యూట్యూబ్ తెలిపింది. భవిష్యత్తులో తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లోనూ పాఠాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. మొబైల్, డెస్క్‌టాప్ రెండింటి ద్వారా ఈ పాఠాలు వినవచ్చు.
అలాగే వీడియో సమావేశాలకు ఉపయుక్తమయ్యే 'గూగుల్ మీట్' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందీ సంస్థ. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 250 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకేసారి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సంస్థ ఈ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఉపయోగించి 250 మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించింది.
అలాగే ఎడ్యూహబ్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. చదువరుల కోసం ఉద్దేశించిన ఈ రీడింగ్ యాప్‌కు 'బోలో' అని పేరు పెట్టింది. దీని ద్వారా విద్యార్థులు ఆయా ప్రోగ్రామ్స్‌ను ఓపెన్ చేసి తమకు తాముగా నేర్చుకోవచ్చు. అలాగే పిల్లల కోసం ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేస్తోంది.
వాస్తవానికి పిల్లల యాప్‌ను ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి తేవాలని భావించినా, ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పిల్లలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ముందే అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. తొలుత అమెరికాలో అందుబాటులోకి వస్తున్న ఈ సదుపాయం తరువాత ఇతర దేశాల వారికీ అందుబాటులోకి రానుంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.