పది నిమిషాల్లో ఫలితాన్నిచ్చే దక్షిణ కొరియా కరోనా కిట్లు... ప్రారంభించిన సీఎం జగన్

  • సియోల్ నుంచి లక్ష టెస్టింగ్ కిట్లు రాష్ట్రానికి రాక
  • ఏకకాలంలో వేలమందికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం
  • నాలుగైదు రోజుల్లో జిల్లాలకు తరలింపు
మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కరోనా కట్టడి ఆశించిన రీతిలోనే సాగుతోంది. రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తికి మరింత కట్టుదిట్టంగా అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న ఏపీ సర్కారు తాజాగా దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది. సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో రాష్ట్రానికి వచ్చిన ఈ కరోనా టెస్టింగ్ కిట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ టెస్టింగ్ కిట్లు 10 నిమిషాల లోపే ఫలితాన్నివ్వగలవు. వీటి సాయంతో ఏకకాలంలో వేలమందికి కరోనా టెస్టులు చేయవచ్చని అధికారులు అంటున్నారు. రాబోయే నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కొరియా టెస్టింగ్ కిట్లను పంపిస్తామని, భారీ సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.


More Telugu News