భారత్ సహా అన్ని దేశాలు కరోనాపై పోరాడుతుంటే ఉగ్రవాదం ఎగదోస్తూ పాక్ బిజీగా ఉంది: ఆర్మీ చీఫ్ మనోజ్

  • జమ్మూకశ్మీర్ లో పర్యటించిన ఆర్మీ చీఫ్
  • భారత్ ను ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు చేస్తోందంటూ పాక్ పై ఆగ్రహం
  • పాక్ కుతంత్రాలు ఎప్పటికీ ఫలించవని స్పష్టీకరణ
భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే పాకిస్థాన్ పై నిప్పులు చెరిగారు. భారత్ సహా ప్రపంచదేశాలన్నీ కరోనా రక్కసితో పోరాడుతుంటే పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని మండిపడ్డారు. కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో భారత్ తన సొంత ప్రజల బాగోగులు చూసుకోవడమే కాకుండా, వైద్య బృందాలను, ఔషధాలను పంపిస్తూ ఇతర దేశాలకు కూడా సాయం చేస్తోందని తెలిపారు.

కానీ పాకిస్థాన్ చేస్తున్న పని మాత్రం ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ భారత్ ను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తుండడమేనని విమర్శించారు. ఇది దురదృష్టకర పరిణామం అని అన్నారు. పాక్ పన్నాగాలు ఎన్నటికీ ఫలించవని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్న సందర్భంగా నరవాణే ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News