పూజ హెగ్డేను ఖరారు చేయలేదన్న హరీశ్ శంకర్

  • స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాను
  •  ఏ హీరోయిన్ ను సంప్రదించలేదు
  •  స్క్రిప్ట్ పూర్తయ్యాకే మిగతా విషయాలన్న హరీశ్ శంకర్
'దువ్వాడ జగన్నాథం' సినిమాతో పూజ హెగ్డే కెరియర్ కి ఊపునిచ్చిందే హరీశ్ శంకర్. ఆ సినిమాలో ఆమె అందాల ఆరబోత యూత్ ను ఫిదా చేసింది. సహజంగానే ఆమెకి వరుస అవకాశాలు వచ్చాయి .. అవి అనూహ్యమైన విజయాలను సాధించాయి. దాంతో పూజకి చాలా తక్కువ సమయంలో స్టార్ డమ్ వచ్చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆమె మరోసారి హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా ఆయన చేయనున్న సినిమా కోసం ఆమెను సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం హరీశ్ శంకర్ వరకూ వెళ్లడంతో  ఆయన స్పందించాడు. 'ప్రస్తుతం నేను స్క్రిప్ట్ పైనే కసరత్తు చేస్తున్నాను. ఇంతవరకూ ఏ హీరోయిన్ ను సంప్రదించలేదు .. ఎవరినీ ఖరారు చేయలేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తరువాతనే హీరోయిన్ ఎవరైతే బాగుంటారా అని ఆలోచిస్తాను' అని చెప్పుకొచ్చాడు.


More Telugu News