ఈ మహమ్మారి మనకు ఓ పెద్ద సవాలే కాదు.. ఓ అవకాశం కూడా!: రాహుల్ గాంధీ

  • సంక్షోభ సమయంలో సమస్యల పరిష్కార ప్రయత్నాలు జరగాలి
  • కొత్త ఆవిష్కరణలు, మార్గాల కోసం శాస్త్రవేత్తల సంఖ్యను భారీగా పెంచాలి
  • ఆవిష్కరణల అవసరాన్ని ఇటువంటి విపత్కర పరిస్థితులు గుర్తు చేస్తాయి
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని, కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను భారీగా పెంచాలని వాదిస్తోన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు మరోసారి కొవిడ్‌-19పై స్పందించారు.

'కొవిడ్‌-19 మహమ్మారి చాలా పెద్ద సవాలే.. కానీ, ఇది ఒక అవకాశం కూడా. మన దేశంలో సంక్షోభ సమయంలో సమస్యల పరిష్కారానికి కొత్త ఆవిష్కరణలు, మార్గాల కోసం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డేటా విశ్లేషకుల సంఖ్యను భారీగా పెంచాల్సి ఉంది' అని ఆయన ట్వీట్ చేశారు. దేశంలో వినూత్న ఆవిష్కరణల అవసరాన్ని ఇటువంటి విపత్కర పరిస్థితులు గుర్తు చేస్తాయన్నారు. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహాన్నివ్వాలని సూచించారు.



More Telugu News