అడ్డుకున్నందుకు పోలీసులపై తిరగబడిన కూరగాయలమ్మే మహిళ.. మీడియాకు చిక్కిన వీడియో
- మహారాష్ట్రలో ఘటన
- కరోనా కట్టడి ప్రాంతంలోకి వెళ్లొద్దన్న పోలీసులు
- వెళ్తానన్న మహిళ
- నెట్టేసిన పోలీసులు
కూరగాయలు అమ్మేందుకు వచ్చిన తనను కరోనా కట్టడి ప్రాంతంలోకి (కంటైన్మెంట్ జోన్)లోకి వెళ్లనివ్వని పోలీసులపై ఓ మహిళ తిరగబడిన ఘటన మహారాష్ట్రలోని ముర్ఖుద్‌లో చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి విజృంభణ అధికంగా ఉన్న ప్రాంతాలను పోలీసులు కట్టడి ప్రాంతాలుగా ప్రకటించి ఆ ప్రాంతాల్లోంచి ఎవరూ బయటకు రాకుండా, లోపలికి వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తోపుడు బండిపై కూరగాయలు అమ్మేందుకు ఓ మహిళ వచ్చింది. ఆ ప్రాంతంలోకి వెళ్లకూడదని ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వెళ్తానని తనను అడ్డుకోవద్దని గొడవ పడింది.
దీంతో ఆమెను ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు ఆమె బండిని బోల్తా పడేశారు. కూరగాయలన్నీ కిందపడిపోయాయి. దాంతో ఆగ్రహించిన సదరు మహిళ పోలీసులను కొడుతూ బీభత్సం సృష్టించింది. దీంతో పోలీసులు కూడా ఆమెను చితక్కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు దొరికింది.