మాటెర్ హార్న్ పై త్రివర్ణ పతాకం దర్శనమిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు: అల్లు అర్జున్

  • భారత్ కు సంఘీభావం ప్రకటించిన స్విట్జర్లాండ్
  • మాటెర్ హార్న్ పర్వతంపై దేశాల జాతీయ పతాకాల ప్రదర్శన
  • హృదయానికి హత్తుకుందన్న బన్నీ
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా స్విట్జర్లాండ్ అనేక దేశాలకు సంఘీభావం ప్రకటిస్తోంది. ఈ క్రమంలో జెర్మాట్ నగరం సమీపంలోని సుప్రసిద్ధ మాటెర్ హార్న్ పర్వతంపై ఆయా దేశాల జాతీయ పతాకాలను ప్రదర్శిస్తోంది. భారత త్రివర్ణపతాకాన్ని కూడా మాటెర్ హార్న్ పై లైటింగ్ సాయంతో ప్రదర్శించడం పట్ల టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశాడు. "థాంక్యూ స్విట్జర్లాండ్" అంటూ ట్వీట్ చేశాడు.  మాటెర్ హార్న్ పర్వతంపై భారత త్రివర్ణ పతాకాన్ని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నాడు. కరోనాపై పోరు నేపథ్యంలో, భారతదేశం పట్ల జెర్మాట్ నగరం ప్రదర్శిస్తోన్న సౌభ్రాతృత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, ఈ చర్య తన హృదయానికి హత్తుకుందని తెలిపాడు.


More Telugu News