ఫేస్ బుక్ లో అమ్మాయిగా చెలామణి.. పోలీసుల విచారణలో అబ్బాయిగా తేలిన వైనం!
- నిషా పేరుతో తప్పుడు ఫేస్ బుక్ అకౌంట్ నడుపుతున్న రవి
- 11 ఏళ్లుగా ఇంజినీరింగ్ పాస్ కాని రవి
- అసలు నిజాన్ని ఫేస్ బుక్ ద్వారా చెప్పించిన పోలీసులు
నిషా జిందాల్.. ఓ అందమైన మహిళ. ఫేస్ బుక్ లో ఆమెకు 10 వేల కంటే ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే, ఫేస్ బుక్ లో వివాదాస్పదమైన పోస్టులు పెడుతుండటంతో ఆ ఖాతాపై పోలీసులు నిఘా పెట్టి, విచారణ జరిపారు. ఈ విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ఈ ఖాతా అసలు మహిళదే కాదు. నిషా అగర్వాల్ అనే పేరుతో, అమ్మాయి ఫొటో పెట్టి... రవి అనే వ్యక్తి ఈ అకౌంట్ ను నడిపిస్తున్నాడు. రవిని ఇంజినీరింగ్ విద్యార్థిగా గుర్తించారు. చత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
రవిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లినప్పుడు మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. 11 ఏళ్ల నుంచి రవి ఇంజినీరింగ్ పాస్ కాలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా 10 వేల మంది ఫాలోయర్లకు తెలియజేయాలని పోలీసులు అతనిని ఆదేశించారు. దీంతో, తన ఖాతాలో తన ఒరిజినల్ ఫొటోను రవి షేర్ చేశాడు. అంతేకాదు... 'నేను పోలీస్ కస్టడీలో ఉన్నా. నిషా జిందాల్ నేనే' అని అసలు విషయాన్ని వివరించాడు.
ఈ సందర్భంగా చత్తీస్ గఢ్ పోలీసులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ ప్రశంసలు కురిపించారు. తప్పుడు పనులను క్షమించే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.