నితిన్ కారణంగానే నటుడినయ్యాను: కమెడియన్ సత్య
- మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం
- 'ద్రోణ' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను
- ఆ దర్శకుల సినిమాల్లో చేయాలనుందన్న సత్య
తెలుగు తెరపై సందడి చేసే కమెడియన్స్ లో సత్య స్థానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. నల్లగా .. బొద్దుగా కనిపిస్తూ, తనదైన బాడీలాంగ్వేజ్ తో ఆయన కితకితలు పెడుతుంటాడు. ఇటీవల కాలంలోనే ఆయన వరుస సినిమాలతో బిజీ అవుతూ వచ్చాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అమలాపురంలో వున్న ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
"మొదటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం .. అందువల్లనే హైదరాబాద్ వచ్చాను. అనేక ప్రయత్నాలు చేసిన అనంతరం, నితిన్ 'ద్రోణ' సినిమాకి అసిస్టెంట్ గా పనిచేసే అవకాశం లభించింది. ఆ సమయంలోనే నాలో నటుడు ఉన్నాడనే విషయాన్ని నితిన్ .. ఆ సినిమా దర్శకుడు కరుణ్ కుమార్ గ్రహించి నన్ను ప్రోత్సహించారు. ఆ సినిమాతో నటుడిగా నా కెరియర్ మొదలైంది. 'స్వామిరారా' .. 'ఛలో' .. 'గద్దలకొండ గణేశ్' సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం నా కెరియర్ సంతృప్తికరంగా సాగుతోంది. రాబోయే రోజుల్లో రాజమౌళి .. త్రివిక్రమ్ .. పూరి సినిమాల్లో నటించాలని వుంది" అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.