ఇటువంటి చర్యలు సరికాదు.. జనసైనికులారా, వైద్యులకు అండగా ఉండండి: పవన్ కల్యాణ్
- తమ పని తాము చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు
- మనందరం ఇటువంటి పిరికి చర్యలను ఖండించాలి
- సేవలందిస్తోన్న జనసైనికులకు ధన్యవాదాలు
కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తోన్న వైద్య సిబ్బందిపై దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. 'తమ పని తాము చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులు సరికాదు. మనందరం ఇటువంటి పిరికి చర్యలను ఖండించాలి. జనసేన నాయకులు, జనసైనికులు వైద్యులకు మద్దతుగా నిలబడండి' అని ట్వీట్ చేశారు.
కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో సేవలందిస్తోన్న జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. 'జనసేన పార్టీ ఆఫీసు (హైదరాబాద్ )లో పనిచేసే తూ. గో జిల్లా, పిఠాపురానికి చెందిన శ్రీ సంతోష్ దుర్గ తన రెండు నెలల జీతాన్ని కరోనా కష్టకాలంలో పీఎం కేర్స్ ఫండ్ కి విరాళం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు' అని ట్వీట్ చేశారు.
హిందూపురం నియోజకవర్గ పరిధిలో నిత్యం 200 మందికి అన్నదానం చేయడంతో పాటు వివిధ గ్రామాల్లో నిరుపేదలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఆకుల ఉమేశ్‌కి పవన్ అభినందనలు తెలిపారు. 'హిందూపూరం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు శ్రీ ఆకుల ఉమేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు' అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు.