ఉల్లంఘనుల చేత నడిరోడ్డుపై వ్యాయామం చేయించిన పోలీసులు!

  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘటన
  • బయటకు రావద్దని చెబుతున్నా వినిపించుకోని యువత
  • ఇళ్లలోనే ఉండాలంటూ పోలీసుల హితబోధ 
కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపై తిరగొద్దని పోలీసులు, అధికారులు ఎంతగా చెబుతున్నప్పటికీ కొందరు వినిపించుకోకుండా రహదారులపై తిరుగుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారికి పోలీసులు రోడ్లపైనే బుద్ధి చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఉల్లంఘనదారులను లాఠీలతో కొట్టడం, సారీ అని 500 సార్లు రాయించడం వంటి శిక్షలు వేస్తోన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోలీసులు వినూత్న రీతిలో శిక్ష విధించడం వైరల్‌గా మారింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిని రోడ్డుపై నిలబెట్టిన పోలీసులు వారితో వ్యాయామం చేయించారు.

చేతులు, కాళ్లు ఆడిస్తూ పలువురు యువకులు వ్యాయామం చేశారు. కొందరికి మిలటరీ ట్రైనింగ్‌ స్థాయిలో పోలీసులు శిక్ష విధించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని వారు సూచించారు.


More Telugu News