కొరటాల శివ విసిరిన ఛాలెంజ్ పై విజయ్ దేవరకొండ స్పందన

  • మా మమ్మీ పని చేయనివ్వట్లేదు
  • మమ్మల్ని ఇంకా రియల్ మేన్ గా చూడట్లేదు
  • ఇంకా పిల్లల మాదిరే చూస్తున్నారు
'అర్జున్ రెడ్డి' సినిమా దర్శకుడు సందీప్ వంగ ప్రారంభించిన 'బీ ది రియల్ మేన్' ఛాలెంజ్ కు సినీ సెలబ్రిటీల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని టాస్క్ ను పూర్తి చేస్తున్నారు. ఇంటి పనుల్లో భర్తలు (మగవారు) కూడా పాలుపంచుకోవాలనేదే ఈ టాస్క్. ఇప్పటికే ఈ ఛాలెంజ్ ను రాజమౌళి, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, కొరటాల శివ తదితరులు పూర్తి చేశారు.

మరోవైపు కొరటాల శివ తన టాస్క్ ను పూర్తి చేసిన తర్వాత హీరో విజయ్ దేవరకొండను నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్ పై విజయ్ ట్విట్టర్ ద్వారా సరదా వ్యాఖ్యలు చేశారు. 'శివ సార్... మా మమ్మీ నన్ను పని చేయనివ్వట్లేదు. పని డబుల్ అవుతుందట. ఇంట్లో ఇంకా మమ్మల్ని రియల్ మేన్ గా చూడట్లేదు. పిల్లల్లాగానే  ట్రీట్ చేస్తున్నారు. కానీ ఈ లాక్ డౌన్ లో నేనేం చేస్తున్నానో చూపిస్తాను' అని సమాధానం ఇచ్చాడు.


More Telugu News