ఆన్ లైన్ లూడో గేమ్ లో భార్య గెలిచిందని వెన్ను విరగ్గొట్టిన భర్త!
- వడోదరలో ఘటన
- లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జంట
- భర్తపై వరుసగా నాలుగు రౌండ్లు గెలిచిన భార్య
- అవమానంగా భావించిన భర్త
లాక్ డౌన్ కారణంగా గృహ హింస పెరిగిందన్న నివేదికలు అక్షరసత్యం అని నిరూపించే సంఘటన ఇది. గుజరాత్ లోని వడోదరలో ఓ వ్యక్తి తన భార్యపై దాడికి దిగి ఆమె వెన్ను విరగ్గొట్టాడు. ఆన్ లైన్ లూడో గేమ్ లో భర్తపై గెలవడమే ఆమె చేసిన నేరమైంది! వడోదరలోని వేమలి ప్రాంతంలో నివసించే ఆ 24 ఏళ్ల యువతి ట్యూషన్లు చెబుతుంది. ఆమె భర్త ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తాడు. లాక్ డౌన్ సమయంలో భర్త ఇరుగుపొరుగుతో గడపడం చూసి, అతడ్ని ఇంట్లోనే ఉంచేందుకు ఫోన్ లో లూడో గేమ్ ఆడదామని ప్రతిపాదించింది.
అయితే, ఆ గేమ్ లో వరుసగా నాలుగు రౌండ్ల పాటు భార్యదే పైచేయి కాగా, భర్త చిత్తుగా ఓడిపోయాడు. దీన్ని అవమానంగా భావించిన ఆ ప్రబుద్ధుడు భార్యపై కిరాతకంగా దాడి చేశాడు. కిందపడేసి అమానుషంగా కొట్టాడు. దాంతో ఆమె వెన్నెముకకు తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రిపాలైంది. చికిత్స అనంతరం భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. తన తల్లిదండ్రుల వద్దకు వెళతానని స్పష్టం చేసింది. అయితే ఓ హెల్ప్ లైన్ వాళ్లు భార్యభర్తల మధ్య రాజీ కుదర్చడంతో విషయం పోలీసుల వరకు వెళ్లలేదు. భర్తతో ఆమెకు క్షమాపణలు చెప్పించారు.