కర్నూలును వణికిస్తున్న మహమ్మారి వైరస్.. 300కు చేరువైన కేసులు!
- 25 రోజుల్లోనే మారిన పరిస్థితి
- 22న అత్యధికంగా 33 పాజిటివ్ కేసుల నమోదు
- ఇప్పటి వరకు 10 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులకు అడ్డుపడకపోగా ప్రతి రోజు మరిన్ని పుట్టుకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,177 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే వెలుగు చూడడం పట్టణ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ కేసుల సంఖ్య 300కు చేరువైంది.
అసలు ఈ నెల 2వ తేదీ వరకు ఇక్కడ నాలుగంటే నాలుగే కేసులు నమోదు కాగా ఆ తర్వాత వరుసగా నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నిర్ధారిత కేసుల సంఖ్య 292కు చేరుకుంది. అలాగే, 10 మంది మృతి చెందారు. 31 మంది డిశ్చార్జ్ అయ్యారు. నేడు మరో 11 మందిని డిశ్చార్జ్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 22న అత్యధికంగా 33 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. నిన్న మరో 13 కేసులు నమోదయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికం కర్నూలు మునిసిపాలిటీ, ఆత్మకూరు, డోన్, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరులోనే ఉండడం గమనార్హం. మండల కేంద్రాలు, గ్రామాల్లో కేసుల నమోదు తక్కువగా ఉండడం కాస్త ఊరటగానే చెప్పచ్చు!