ఏపీ ఎస్ఈసీ నియామక నిబంధనల సవరణపై కేసు విచారణ రేపటికి వాయిదా

  • తమ వాదనలు వినిపించిన నలుగురు పిటిషనర్లు  
  • మాజీ ఎస్ఈసీ రమేశ్ కుమార్ తరఫు న్యాయవాది కూడా
  • మరికొందరు పిటిషనర్లు తమ వాదనలు వినిపించాల్సి ఉంది 
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామక నిబంధనలకు సంబంధించిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురు పిటిషనర్లు తమ వాదనలను హైకోర్టులో వినిపించారు. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తరఫు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు.

ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగానే ఎస్ఈసీ పదవీకాలం కుదింపు జీవోను తీసుకొచ్చిందని రమేశ్ కుమార్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎస్ఈసీ పదవీకాలాన్ని కుదించేలా తీసుకొచ్చిన జీవోతో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా ఉందని, ఈ జీవోను రద్దు చేయాలని ఆయా పిటిషనర్లు కోరారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరికొందరు పిటిషనర్లు తమ వాదనలు వినిపించాల్సి ఉండటంతో తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.


More Telugu News