కిమ్ ఆరోగ్యంపై తొలిసారి స్పందించిన ఐరాస.. తమకు సమాచారం లేదన్న గుటెరెస్
- మేం కూడా వార్తా కథనాల ద్వారానే తెలుసుకున్నాం
- ఆ దేశ ప్రతినిధుల నుంచి మాకు అధికారిక సమాచారం లేదు
- కిమ్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటాం
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమించిందంటూ వస్తున్న వార్తలపై ఐక్యరాజ్య సమితి తొలిసారి స్పందించింది. ఈ విషయంలో తమకు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. తాము కూడా వార్తల ద్వారానే తెలుసుకున్నామని, ఆ దేశ ప్రతినిధుల నుంచి తమకు ఎటువంటి వర్తమానం అందలేదని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ నిన్న రాత్రి పేర్కొన్నారు. కిమ్ ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
కిమ్ ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం విషమ పరిస్థితుల్లో ఉన్నారంటూ ఇటీవల వార్తలు హల్ చల్ చేశాయి. అమెరికా అధికారి ఒకరిని ఉటంకిస్తూ సీఎన్ఎన్ ప్రచురించిన వార్తా కథనం సంచలనం రేపింది. ఆయితే, ఆ వార్తల్లో నిజం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే కొట్టిపడేయగా, పొరుగుదేశం దక్షిణ కొరియా కూడా ఆ వార్తలను ఖండించింది.