కరోనా అప్‌డేట్స్: దేశంలో గత 24 గంటల్లో 1,993 మందికి కొవిడ్-19 నిర్ధారణ
- మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,147
- కరోనా కేసుల సంఖ్య 35,043
- కోలుకున్న వారు 8,888 మంది
- మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 10,498
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,147కి చేరింది.
గత 24 గంటల్లో దేశంలో 1,993 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 35,043కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 8,888 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 25,007 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 10,498కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 459 మంది మృతి చెందారు. 1,773 మంది కోలుకున్నారు.
ఆ తరువాత గుజరాత్‌లో అత్యధికంగా 4,395 మందికి కరోనా సోకగా 214 మంది మృతి చెందారు. 613 మంది కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 3,515కి చేరింది. 1,094 మంది కోలుకోగా, 59 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో 2,625 కేసులు నమోదు కాగా, 137 మంది ప్రాణాలు కోల్పోయారు.
గోవాలో ఏడుగురికి కరోనా సోకగా వారంతా కోలుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోనూ ఒకరికి సోకగా ఆ వ్యక్తి కోలుకున్నారు. మణిపూర్‌లో ఇద్దరికి సోకగా వారు కోలుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో కొత్త కేసులు కూడా నమోదు కాలేదు.