ప్రపంచవ్యాప్త కరోనా మరణాల రేటు 7.1... భారత్ లో 3.2!

  • ప్రపంచవ్యాప్తంగా 3.45 మిలియన్ల కరోనా కేసులు
  • 2.44 లక్షల మంది మృతి
  • భారత్ లో 39 వేల పాజిటివ్ కేసులు
  • 1,301 మరణాలు
భారతదేశ జనాభాతో పోల్చితే దేశంలో కరోనా విస్తృతి ఓ మోస్తరు అని చెప్పుకోవాలి. మరణాల సంఖ్య కూడా తక్కువే. ఇప్పటివరకు 39,980 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,301 మంది మరణించారు. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 3.45 మిలియన్ల మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, 2.44 లక్షల మంది మరణించారు. ప్రపంచవ్యాప్త కరోనా మరణాల రేటు 7.1 శాతం కాగా, భారత్ లో మరణాల రేటు 3.2 శాతం మాత్రమే.

ఇతర దేశాలతో పోల్చితే భారత్ లోనే కరోనా మరణాల సగటు తక్కువ అని కేంద్రం కూడా వెల్లడించింది. ప్రపంచంలోనే అతి తక్కువ సగటు మన దేశంలోనే ఉండడం ఊరడింపు అని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. కేసులు రెట్టింపు అవుతున్న సమయం కూడా క్రమంగా పెరుగుతోందని, రెండు వారాల కిందట కేసులు రెట్టింపు అవుతున్న సమయం 10.5 రోజులు కాగా, ఇప్పుడది 12 రోజులకు పెరిగిందని వివరించారు.


More Telugu News