మహిళల ఆందోళనతో.. రేణిగుంటలో మూతపడ్డ వైన్ షాపులు!

  • ఏపీలో నేడు తెరుచుకున్న మద్యం దుకాణాలు
  • వైన్ షాపులను బంద్ చేయాలని పాపానాయుడుపేట మహిళల ఆందోళన
  • మూడు దుకాణాలు తాత్కాలికంగా మూసివేత
ఏపీలో ఈరోజు మద్యం దుకాణాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే, వైన్ షాపులను తెరవద్దంటూ తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం పాపానాయుడుపేట వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. నివాసాల మధ్యలో ఉన్న వైన్ షాపులను మూసేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. వైన్ షాపులను మూసేయాల్సిందేనని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల జోక్యంతో మూడు మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసేశారు.


More Telugu News