స్మారక కేంద్రంగా జయలలిత నివాసం ‘వేద నిలయం’
- బహిరంగ నోటీసు జారీ చేసిన ప్రభుత్వం
- నిర్వాసితులకు పునరావాసం ఉండబోదని స్పష్టీకరణ
- ప్రారంభమైన భూసేకరణ ప్రక్రియ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసం మూడంతస్తుల ‘వేద నిలయం’ ఇక స్మారక కేంద్రంగా మారనుంది. ఈ మేరకు పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయించింది. పోయెస్ గార్డెన్‌లోని ‘అమ్మ’ నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చేందుకు నిర్ణయిస్తూ ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసింది.
ఈ క్రమంలో నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు పునరావాసం కల్పించబోమని ప్రభుత్వం ఆ నోటీసులో స్పష్టం చేసింది. నిజానికి స్మారక కేంద్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 2018లో ప్రకటన చేసింది. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భూమి కోల్పోయి, నిర్వాసితులుగా మారిన వారికి ఎటువంటి పునరావాసం ప్రభుత్వం కల్పించబోదని తాజా నోటీసులో స్పష్టం చేసింది.