సింగపూర్ ను వణికిస్తున్న కరోనా.. ఈ ఒక్కరోజు ఎన్ని కేసులంటే..?

  • ఈరోజు కొత్తగా 753 కేసుల నమోదు
  • 22,460కి చేరిన కేసుల సంఖ్య
  • యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 20,400
కరోనా దెబ్బకు సింగపూర్ విలవిల్లాడుతోంది. ఆ దేశంలో భారీ ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్క రోజే కొత్తగా 753 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో, ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 22,460కి చేరుకుంది. వారిలో ఇప్పటి దాకా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,040 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 20,400 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కొత్త కేసుల్లో ఎక్కువ మంది వసతి గృహాల్లో నివసించే వలస కార్మికులేనని అక్కడి ప్రభుత్వం తెలిపింది. కేవలం 9 మంది మాత్రమే శాశ్వత నివాసం కలిగిన వారని చెప్పారు.


More Telugu News