నాలుగు రోజులు.. రూ. 600 కోట్లు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

  • నిన్న ఒక్క రోజే రూ.149 కోట్ల విక్రయాలు
  • దుకాణాలకు పోటెత్తుతున్న మందుబాబులు
  • ధరలు పెంచకపోవడం వల్లే ఈ స్థాయిలో అమ్మకాలు
తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. దాదాపు 40 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు పోటెత్తుతున్నారు. గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. నిన్న ఒక్క రోజే మద్యం డిపోల నుంచి రూ.149 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ నెల 6న రూ. 72.5 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, 7న రూ.188.2 కోట్లు, 8న 190.47 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్టు సమాచారం. అంటే మొత్తంగా రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయన్న మాట.

మిగతా రాష్ట్రాల్లానే మద్యం ధరలను భారీగా పెంచి వుంటే ప్రభుత్వానికి ఆదాయం మరింత వచ్చి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా, ధరలు పెంచకపోవడం వల్లే ఈ స్థాయిలో విక్రయాలు జరిగాయన్న వాదన కూడా ఉంది. కాగా, ఏపీలో మద్యం ధరలపై ఏకంగా 75 శాతం పెంచగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం చీప్ లిక్కర్‌పై 11 శాతం, ఖరీదైన మద్యంపై 16 శాతం పెంచింది. 


More Telugu News