ఇవాళ రాత్రికి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ రెండో పెళ్లి!

  • వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్
  • నిజామాబాద్ లోని వెంకటేశ్వరస్వామి గుడిలో ఇవాళ రాత్రికి పెళ్లి
  •  కుటుంబసభ్యుల సమక్షంలో జరగనున్న వివాహం

ఇవాళ రాత్రికి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ రెండో పెళ్లి!
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు వృత్తిపరమైన ఇబ్బందులు అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.

అలాగే, తన వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా లేదని, త్వరలోనే అంతా సర్దుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన దిల్ రాజు, ఈ తాజా మలుపుతో వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు తన పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా, నిజామాబాద్ లోని వెంకటేశ్వరస్వామి గుడిలో ఇవాళ రాత్రి వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. తన కుటుంబసభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, దిల్ రాజ్ మొదటి భార్య అనిత అనారోగ్యంతో 2017లో చనిపోయారు.


More Telugu News