దేశంలో రైలు ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఈ నెల 12 నుంచి రాకపోకలు
- రేపు సాయంత్రం 4 గంటల నుంచి బుకింగ్స్
- ఢిల్లీ నుంచి ప్రధాన నగరాలకు రైళ్లు
భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12 నుంచి రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఢిల్లీ నుంచి ముఖ్య నగరాలకు ప్రయాణికుల రైళ్లు నడపనున్నారు. ఈ మేరకు రేపు సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్ సీటీసీ ద్వారా ఆన్ లైన్ బుకింగ్స్ షురూ కానున్నాయి. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై సెంట్రల్, తిరువనంతపురం, అహ్మదాబాద్, జమ్మూతావి, అగర్తలా, హౌరా, పాట్నా, దిబ్రూగఢ్, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్ నగరాలకు రైళ్లను నడపనున్నారు. కరోనా లక్షణాలు లేనివారినే రైళ్లలో అనుతిస్తారు.