భారీ ప్యాకేజీపై నేడు ప్రజలకు వివరాలు తెలపనున్న నిర్మలా సీతారామన్
- కరోనా విపత్తు నేపథ్యంలో స్వావలంబనే లక్ష్యంగా ప్యాకేజీ
- రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోదీ
- పూర్తి వివరాలు చెప్పనున్న నిర్మలా సీతారామన్
- ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం
కరోనా విపత్తు నేపథ్యంలో స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిన్న భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. కుప్పకూలుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదే ప్రయత్నాల్లో భాగంగా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇది భారత జీడీపీలో దాదాపు 10 శాతమని ప్రకటించారు.
ప్యాకేజీని ప్రజలకు అందజేసే అంశాలపై పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి వివరించి చెప్పనున్నారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వల్ల ప్రజలకు ఎలా లబ్ధి చేకూరనుందన్న విషయాలపై ప్రకటన చేయనున్నారు.
భారత్ అంతర్జాతీయంగా పోటీ పడేలా ఈ ప్యాకేజీ ఉంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు తెలిపారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు దేశాలు భారీ ప్యాకేజీలు ప్రకటించాయి. జపాన్ తమ జీడీపీలో 21 శాతం, అమెరికా 13 శాతం విలువైన ప్యాకేజీలను ప్రకటించాయి. ఆ తర్వాత అతి పెద్ద ప్యాకేజీని ప్రకటించిన దేశంగా భారత్ నిలిచింది.