కరోనా భయం.. కన్నతండ్రినే ఇంట్లోకి అడుగుపెట్టనివ్వని కుమారులు

  • తూర్పుగోదావరిలోని సోదరుడి ఇంటికి వెళ్లిన వృద్ధుడు
  • ఈ నెల 10న తెనాలి చేరుకున్న వైనం
  • ఇంట్లోకి రావొద్దనడంతో రోడ్డుపైనే ఉండిపోయిన తండ్రి
కరోనా భయం ప్రజలను ఎంతగా వణికిస్తుందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. లాక్‌డౌన్ కారణంగా వేరే ప్రాంతంలో చిక్కుకుపోయిన తండ్రి ఎలాగోలా తిరిగి ఇంటికి చేరుకుంటే లోపలికి అడుగుపెట్టవద్దంటూ హుకుం జారీ చేశారు కుమారులు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిందీ ఘటన.

పట్టణానికి చెందిన వృద్ధుడు (60) తూర్పుగోదావరి జిల్లాలో నివసించే తన తమ్ముడి ఇంటికి మార్చిలో వెళ్లాడు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. ఈ నెల పదో తేదీన ఎలాగోలా తిరిగి తెనాలిలోని ఇంటికి చేరుకున్నాడు. అయితే, కోవిడ్ భయం కారణంగా తండ్రిని ఇంట్లోకి అడుగుపెట్టకుండా కుమారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే ఉండసాగాడు. అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధుడిని ఇంట్లోకి పంపడంతో సమస్య సద్దుమణిగింది.


More Telugu News