లాక్ డౌన్ 4.0 దెబ్బకు కుదేలైన మార్కెట్లు
- ఇన్వెస్టర్లను ఆకట్టుకోని కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ
- పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన
- 1,068 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఆకట్టుకోకపోవడం, లాక్ డౌన్ 4.0, దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మదుపరులు అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,068 పాయింట్లు కోల్పోయి 30,028కి పడిపోయింది. నిఫ్టీ 313 పాయింట్లు నష్టపోయి 8,823 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-10.02%), అల్ట్రాటెక్ సిమెంట్ (-7.59%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-7.55%), యాక్సిస్ బ్యాంక్ (-7.55%), మారుతి సుజుకి (-7.40%).
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం టీసీఎస్ (2.72%), ఇన్ఫోసిస్ (1.73%) మాత్రమే ఈరోజు లాభపడ్డాయి.