పోతిరెడ్డిపాడుపై వీరోచిత పోరాటం చేసినట్టు కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
- 2006లోనూ పోతిరెడ్డిపాడుపై స్పందించలేదని వెల్లడి
- వైఎస్సార్ ఇచ్చిన జీవోపైనా కేసీఆర్ ఏం మాట్లాడలేదన్న రేవంత్
- జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసినా స్పందించడం లేదంటూ వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 2006లో కేసీఆర్, ఆలె నరేంద్ర అప్పటి కేంద్ర క్యాబినెట్ నుంచి బయటికి వచ్చారని, వారు ఆ సమయంలో పోతిరెడ్డిపాడుపై ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. అంతకుముందు, 2005లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ వైఎస్సార్ ఇచ్చిన జీవోపైనా కేసీఆర్ స్పందించలేదని తెలిపారు.
కానీ ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై తాను వీరోచిత పోరాటం చేసినట్టు కేసీఆర్ గొప్పలు చెబుతున్నారని ఆరోపించారు. ఏపీ సర్కారు జారీ చేసిన జీవో నెం.203 కారణంగా తెలంగాణ దక్షిణ ప్రాంతం ఎడారిగా మారుతుందని అన్నారు. పోతిరెడ్డిపాడుపై జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత కూడా కేసీఆర్ స్పందించకపోవడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు.