చివర్లో ప్రాఫిట్ బుకింగ్.. అయినా లాభాల్లోనే ముగిసిన మార్కెట్లు

  • 114 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ఏడున్నర శాతం లాభపడ్డ ఐటీసీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు సూచీలు లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో అప్పటి వరకు వచ్చిన లాభాలు కొంతమేర తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 30,933కి చేరింది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 9,106 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (7.48%), ఏసియన్ పెయింట్స్ (4.97%), హీరో మోటోకార్ప్ (3.93%), మారుతి సుజుకి (3.14%), బజాజ్ ఆటో (2.57%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.91%), ఎన్టీపీసీ (-2.74%), బజాజ్ ఫైనాన్స్ (-2.65%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.88%), ఎల్ అండ్ టీ (-1.75%).


More Telugu News