మరోసారి బండ్ల గణేశ్ ఆసక్తికర ట్వీట్
- ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు
- ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో
- బతికినంత కాలం బాగుపడతావ్
సినీ నిర్మాత బండ్ల గణేశ్ తన ట్విట్టర్ ఖాతాలో చేస్తోన్న వ్యాఖ్యలు టాలీవుడ్లో కాక రేపేలా ఉన్నాయి. ఇటీవల ఆయన 'తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక... లేని మాటలు అంటకడతారు' అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ దర్శకుడు హరీశ్ శంకర్‌ను ఉద్దేశించే చేశారని ఊహాగానాలు వచ్చాయి. తాజాగా బండ్ల గణేశ్ మరోసారి ఇటువంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు.
'ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో.. బతికినంత కాలం బాగుపడతావ్' అని బండ్ల గణేశ్ అన్నారు. 'ఎవరిమీదన్న అంత ఫ్రస్ట్రేషన్?' అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
'ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో.. బతికినంత కాలం బాగుపడతావ్' అని బండ్ల గణేశ్ అన్నారు. 'ఎవరిమీదన్న అంత ఫ్రస్ట్రేషన్?' అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.