ఆస్తులు అమ్మమని దేవుడు చెప్పాడా?: టీటీడీ వ్యవహారంపై మంచు మనోజ్ వ్యాఖ్యలు

  • దుమారం రేపుతున్న శ్రీవారి ఆస్తుల విక్రయం
  • టీటీడీపై పెరుగుతున్న విమర్శలు
  • ఎందుకు అమ్ముతున్నారో వివరణ ఇవ్వాలన్న మంచు మనోజ్
శ్రీవారి ఆస్తుల విక్రయం అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా దీనిపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా అంటూ టీటీడీని సూటిగా ప్రశ్నించారు. శ్రీవారికి సంబంధించిన ప్రతి విషయం చెప్పేది, చేసేది టీటీడీయేనని స్పష్టం చేశారు.

"సుప్రభాత సేవకు వేళయింది అని ఆ శ్రీహరిని, కొండకు వచ్చిన లక్షలమంది భక్తులను అందరినీ కంట్రోల్ చేసేది టీటీడీనే. అలాంటిది, వడ్డీకాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గోవింద నామస్మరణ చేసే నా గొంతు తడబడింది. అయితే, మోసం జరగట్లేదని తెలుసు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లా కాకుండా అందరు చూస్తుండగా వేలం వేసి అమ్ముతారు. కానీ ఎందుకు అమ్మాల్సి వచ్చింది అనే అంశంపై పాలకమండలి వివరణ ఇస్తే బాగుంటుంది. వివరణ తప్ప మరేమీ కోరడంలేదు, ఎందుకంటే, ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉందని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడ్ని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నాను" అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News