విశ్వాసమంటే ఇదే... కరోనాతో చనిపోయిన యజమాని కోసం మూడు నెలలుగా ఆసుపత్రి వద్దే ఉన్న శునకం!

  • కరోనా వెలుగుచూసిన వూహాన్ లో ఘటన
  • వైరస్ కారణంగా చనిపోయిన శునకం యజమాని
  • మత్తిచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లిన అధికారులు
పెంపుడు జంతువులన్నింటిలో శునకాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. ఒకసారి తన యజమానిని అది నిర్ణయించుకున్న తరువాత, ఎంతో విశ్వాసాన్ని చూపుతుంది. ఈ విషయం ఎన్నోమార్లు రుజువైంది కూడా. అటువంటిదే మరో ఘటన చైనాలో కరోనా వైరస్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన వూహాన్ లో జరిగింది.

కరోనా వైరస్ తో తన యజమాని చనిపోయాడన్న విషయం తెలియని ఓ పెంపుడు కుక్క, మూడు నెలలుగా ఆసుపత్రి వద్దే యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఈ శునకానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ శునకం బాధను చూడలేకపోయిన వూహాన్ స్మాల్ ఏనిమల్ ప్రొటెక్షన్ అసోసియేషన్ సిబ్బంది, దానికి మత్తిచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల సమాహారాన్ని మీరూ చూడవచ్చు. 


More Telugu News