ఎన్టీఆర్, చిరంజీవి సినిమా స్టిల్ ను పంచుకున్న రామ్ చరణ్

  • ఇవాళ ఎన్టీఆర్ జయంతి
  • ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన రామ్ చరణ్
  • తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకువచ్చారంటూ ట్వీట్
దాదాపు టాలీవుడ్ ప్రముఖులందరూ సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్న రోజులివి. ఇవాళ నట దిగ్గజం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి కావడంతో ఆయనను స్మరించుకుంటూ సెలబ్రిటీల నుంచి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ జయంతిపై స్పందించారు.

"తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకువచ్చిన ఆ మహనీయుడ్ని గుర్తు చేసుకుందాం. మహోన్నతుడైన ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా వేడుక చేసుకుందాం" అంటూ ట్విట్టర్ లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి, ఎన్టీఆర్ తో కలిసి నటించిన 'తిరుగులేని మనిషి' చిత్రంలోని ఓ స్టిల్ ను కూడా పంచుకునున్నారు. 1981లో వచ్చిన తిరుగులేని మనిషి చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.


More Telugu News