కడప శివారులోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
- నగర శివారులోని బుడ్డాయపల్లిలో ఘటన
- రూ. 85 లక్షల వరకు ఆస్తినష్టం
- షార్ట్ సర్క్యూటే కారణం?
కడప శివారులోని బుడ్డాయపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో రూ. 85 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.