లాక్ డౌన్ 5.0 ఉంటుందనే అంచనాల మధ్య.. మమతా బెనర్జీ కీలక ప్రకటన! 

  • జూన్ 1 నుంచి అన్ని ప్రార్థనాలయాలు పునఃప్రారంభం
  • జూన్ 8 నుంచి పని చేయనున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు
  • జనాలు వస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయన్న దీదీ
ఈ నెలాఖరుతో లాక్ డౌన్ 4.0 ముగుస్తోంది. మరోవైపు లాక్ డౌన్ 5.0 అమల్లోకి రావచ్చనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరే ఇతర సీఎం ప్రకటించని సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

 జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రార్థనాలయాలను తెరవనున్నట్టు ప్రకటన చేశారు. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రార్థనా స్థలాలను తెరవనున్న తొలి రాష్ట్రంగా బెంగాల్ నిలవనుంది. మరోవైపు జూన్ 8వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలన్నింటినీ పూర్తిగా తెరవాలని మమత ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ, గత రెండు నెలలుగా కరోనాను విజయవంతంగా అదుపు చేశామని తెలిపారు. అయితే, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి జనాలు వస్తుండటంతో తాజాగా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.


More Telugu News