అమెరికాలోని పలు నగరాల్లో హింసాకాండ.. కర్ఫ్యూ విధింపు
- జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్లజాతీయుడి మృతితో ఘర్షణలు
- నిరసనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగం
- లాస్ ఏంజెలిస్, షికాగో, అట్లాంటాలతో పాటు పలు నగరాల్లో కర్ఫ్యూ
- ఆందోళనల వెనుక లెఫ్ట్ భావజాలం హస్తం ఉందన్న ట్రంప్
జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్లజాతీయుడిపై ఓ తెల్లజాతీయుడైన పోలీసు కర్కశంగా వ్యవహరించి చంపేయడంతో జాత్యహంకారానికి వ్యతిరేకంగా అమెరికా నిరసనలతో అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వందలాది మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు, నిరసన కారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. నిరసనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. హింసాకాండ చెలరేగుతుండడంతో అమెరికాలోని లాస్ ఏంజెలిస్, షికాగో, అట్లాంటాతో పాటు పదికి పైగా నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని పోలీసులు చెప్పారు.
నిరసనలు ఉద్ధృతం అవుతుండడంతో నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపాలని కొన్ని రాష్ట్రాలు ట్రంప్ సర్కారుని కోరాయి. కాగా, అమెరికాలో ఈ ఆందోళనల వెనుక లెఫ్ట్ భావజాలం హస్తం ఉందని ట్రంప్ అన్నారు. సమాజాన్ని నాశనం చేసే అవకాశం నేరస్తులకు ఇవ్వద్దంటూ ఆయన వ్యాఖ్యానించారు.