తగ్గుతున్న పసిడి రేటు.. మరో రూ.734 తగ్గిన ధర!
- వారం రోజుల క్రితం భారీగా పెరిగిన పసిడి ధర
- కొన్ని రోజులుగా తగ్గుముఖం
- దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.46,395
కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు ఉదయం ఉదయం 10:15 గంటలకు పసిడి ధర మరో రూ.734 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.46,395గా ఉంది. గత కొన్ని రోజులుగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటి మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండడంతో, ఇన్వెస్టర్లు వాటిపై దృష్టిపెడుతున్నారనీ, దాంతో పసిడి ధరలు తగ్గుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
డాలర్ ఇండెక్స్ 0.2 శాతం తగ్గి రెండు నెలల కనిష్ఠానికి చేరడం కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయని తెలిపారు. కాగా, గ్లోబల్ మార్కెట్‌లోనూ 20 డాలర్లు తగ్గి ఔన్స్ బంగారం 1,728.60 డాలర్లుగా ఉంది. వారం రోజుల క్రితం బంగారం ధరలు అమాంతం పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే.